telangana
అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ
కుత్బుల్లాపూర్, మేజర్ న్యూస్: ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. అరుణ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ లో వేలాదిగా భక్తి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలు భజన గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి పాటలు భక్తి ఆరవశంలో ముంచెత్తాయి. అనంతరం వేలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు