telangana
ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : చేయూత పించన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గురువారం మల్కాజిగిరిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఏకే మురుగేష్, ప్రేమ్ కుమార్, జితేంద్ర నాథ్, మాజీ కౌన్సిలర్లు వెంకటేష్, ఎస్ ఆర్ ప్రసాద్, ఇందిరా ప్రియదర్శిని, మల్కాజిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు