telangana
ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి): ప్రయాణికుడితో ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించిన ఘటనకు సబందించి పలు దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఈ కథనాల ఆధారంగా ఘటనపై విచారణ జరిపిన అనంతరం, సంబంధిత డ్రైవర్ బి. సూర్య (బ్యాడ్జి నంబర్ 421)ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్-1 డిపోకు చెందిన డ్రైవర్ సూర్య ఈ నెల 12వ తేదీన ఎంజీబీఎస్ నుంచి రాయచూర్‌కు వెళ్లే మార్గంలో బస్సు నంబర్ TS 06 UD 7611లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉదయం సుమారు 5.50 గంటలకు ఓ ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ ఘటనపై విచారణ అనంతరం సదరు డ్రైవర్ సూర్య సేవలను ఉపసంహరిస్తూ...రాష్ట్రంలోని ఏ డిపోలోనూ ప్రైవేట్ హైర్ బస్సులపై విధులు కేటాయించరాదని అన్ని డిపో మేనేజర్లను ఆదేశించారు.
అదేవిధంగా, సంబంధిత బస్సు యజమాని డ్రైవర్ సూర్య స్థానంలో అర్హత కలిగిన మరో డ్రైవర్‌ను నియమించిన తర్వాతే బస్సును ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని యాజమాన్యం ఆదేశించింది.
ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైనా, సిబ్బంది వల్ల ఇబ్బందులు కలిగినా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.