BREAKING
ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా... పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం ప్రతినిధి హోదాకు భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం

లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ

Select Suryaa Now
లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ

సూర్య, భీమ్‌గల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన అతిథి గృహం (గెస్ట్ హౌస్) పనులకు వారు స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు:మంత్రి సీతక్క మాట్లాడుతూ కొండలు, అడవుల మధ్య కొలువైన లింబాద్రి స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న  మహేష్ కుమార్ గౌడ్  ప్రత్యేక కోరిక మేరకు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 4 కోట్ల నిధులను గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం మంజూరు చేశాము" అని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాలకు కొత్త పెన్షన్ల పంపిణీ ఒక పండగ వాతావరణంలో జరుగుతోందని అన్నారు.బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని నిధులు తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ లింబాద్రి గుట్ట వెనుక ఉన్న రహత్ నగర్ నా స్వగ్రామం. గత 58 ఏళ్లుగా నేను ఈ స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ నిర్మించాలనే ఆలోచన ఉండేది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తో మాట్లాడి వెంటనే రూ. 4 కోట్లు మంజూరు చేశారు" అని వివరించారు.భూమిపూజ జరిగిన ఈ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని రాబోయే ఆరు నెలల్లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో లింబాద్రి నరసింహస్వామి ఆలయ ఖ్యాతిని రాష్ట్ర, దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, సిద్దిపేట సభలో సీఎం ప్రకటించినట్లుగా ప్రతి ఇంటికి రూ. 5 లక్షల బీమా పథకంతో పాటు, అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.