BREAKING
ఇదేందయ్య సామి ! మీ వేడుకలకోసం రోడ్లు మూసేస్తారా... పేద కుటుంబాల ఆర్ధిక భద్రత.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలి: గవర్నర్ ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం ప్రతినిధి హోదాకు భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం

అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం ..

Select Suryaa Now
అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం ..
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : భారత మాజీ ప్రధాని  ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మాజీ మంత్రి దానం నాగేందర్ హిమాయత్ నగర్ కు చెందిన పలువురికి చేయూత పెన్షన్, ఇందిర బీమా యోజన పథకాన్ని అందజేశారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాలను మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని సేవాలాల్ భవన్లో మంత్రి సీతక్క, మాజీ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ లతో కలిసి ప్రారంభించి అర్హులకు అందించారు. హిమాయత్ నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన దాదాపు 300 మంది సేవాలాల్ భవనానికి తరలి వెళ్లారు. ఈ వేడుకల్లో దానం నాగేందర్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరమ్మ గరీబీ హటావో అనే నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని పేదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని తెలిపారు. ఇందిర బీమా యోజనను అర్హులైన పేదలందరికీ హిమాయత్ నగర్ లో అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.