BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి

Select Suryaa Now
10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి.    ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి
కుత్బుల్లాపూర్, మేజర్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 10+2 విద్యా విధానాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ స్వాగతిస్తోందని సంఘం డాక్టర్ శివరాత్రి యాదగిరి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు.
పదవ తరగతి పూర్తయిన తర్వాత సుమారు 40 శాతం మంది విద్యార్థులు వివిధ సామాజిక, ఆర్థిక కారణాలతో తదుపరి ఉన్నత విద్యకు దూరమవుతున్నారనే ఆందోళనకర పరిస్థితుల  నేపథ్యంలో, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే  ప్రభుత్వ ఆలోచన అభినందనీయమని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం సమర్థవంతంగా అమలయితే విద్యార్థులు చదువులో కొనసాగింపు పెరగడంతో పాటు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అయితే 10+2 విద్యా విధానం అమలు పేరుతో ప్రస్తుతం ఇంటర్మీడియట్ కళాశాలలకు 9వ, 10వ తరగతులను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 10+2 విద్యా విధానం ఉద్దేశం ప్రస్తుతం పదవ తరగతి వరకు నిర్వహిస్తున్న పాఠశాలలకు 11వ, 12వ తరగతులను విస్తరించుకునే అవకాశం కల్పించడం కావాలి తప్ప, ఇంటర్మీడియట్ కళాశాలలకు 9వ, 10వ తరగతులను అప్పగించడం కాకూడదని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ కళాశాలలకు 9వ, 10వ తరగతుల నిర్వహణకు అవకాశం కల్పిస్తే, ఇప్పటికే పరిమిత వనరులతో, తక్కువ ఫీజులతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న వేలాది బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల చిన్న, మధ్యతరహా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉపాధికి కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చని పేర్కొన్నారు..ప్రస్తుతం పదవ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపుతో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన విద్యా ప్రమాణాలు, భద్రతా నిబంధనలకు లోబడి, అనవసరమైన అదనపు ఆర్థిక భారం విధించకుండా 11వ, 12వ తరగతులను నిర్వహించేందుకు అఫిలియేషన్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 2027–28 విద్యా సంవత్సరంలో 11వ తరగతిని అదే పాఠశాలలో కొనసాగించవచ్చా? లేక ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలా? అనే విషయంలో స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. ఈ అనిశ్చితిని తొలగించేందుకు 10+2 విద్యా విధానం అమలు, పాఠశాలల అప్‌గ్రేడేషన్, అఫిలియేషన్, ప్రవేశాలు, పాఠ్యప్రణాళిక, పరీక్షల విధానం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రయోజనం చేకూర్చే విధంగా కాకుండా, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని సూచించారు. విద్యా సంస్కరణల పేరుతో దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తున్న చిన్న, మధ్యతరహా ప్రైవేట్ పాఠశాలలు మూతపడే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులు 12వ తరగతి వరకు ఒత్తిడి లేని విద్యను అభ్యసించేలా, అనంతరం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యా విధానంలో తగిన మార్పులు తీసుకురావాలని సూచించారు.10+2 విద్యా విధానాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే పాఠశాలలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయాలి తప్ప, ఇంటర్మీడియట్ కళాశాలలకు 9వ, 10వ తరగతులు మంజూరు చేసి బడ్జెట్ పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకం చేయవద్దు అని డాక్టర్ శివరాత్రి యాదగిరి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.