BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం

Select Suryaa Now
అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామంలో శుక్రవారం అభివృద్ధి పనులకు సర్పంచ్ బాలయ్య శ్రీకారం చుట్టారు.గ్రామంలోని 5వ,వార్డులో సోమగాని వెంకటమ్మ ఇంటి నుంచి అంకం జంగయ్య ఇంటి వరకు చేపట్టనున్న మురుగునీటి కాలువ (అండర్ డ్రైనేజీ)నిర్మాణ పనులను సర్పంచ్ బాలయ్య,పంచాయతీ కార్యదర్శి శ్రీలత,ఉపసర్పంచ్ అంబేద్కర్,వార్డు సభ్యులు రమేష్ నాయక్,అమరేందర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నారాయణరెడ్డి,నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్క బాలయ్య,మాజీ సర్పంచ్ ఊశన్న,గ్రామ పెద్దలు ఎండీ సత్తార్,సాయిలు,యువకులు యాదయ్య,గోపాల్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.