BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి

హైదరాబాద్ మెజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGOs) హైదరాబాద్ జిల్లా శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యంగా రెండో పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

గురువారం హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ఎస్‌బీటీఈటీ కార్యాలయంలో  టిజిఓస్ హైదరాబాద్ జిల్లా శాఖ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. జిల్లా శాఖ అధ్యక్షులు ఎం.బి. కృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎం.ఎ. ఖాదర్ సమావేశ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. TGOs కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, వేతన సవరణ, పెన్షన్, ఆరోగ్య భద్రత, గృహ నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ తొమ్మిది కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

*42 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి:*
రెండో వేతన సవరణ సంఘం (PRC) నివేదికను ప్రభుత్వం తక్షణమే స్వీకరించి, 42 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ త్వరితగతిన చెల్లించాలని కోరింది.

*వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలి:*
ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, కనీసం GHMC, CMC, MMC కార్పొరేషన్ల పరిధిలోనైనా వారానికి ఐదు పని దినాల విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

*హౌసింగ్ సొసైటీకి 60 ఎకరాల భూమి కేటాయించాలి:*
హైదరాబాద్ జిల్లా గెజిటెడ్ అధికారుల కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి హైదరాబాద్ CURE పరిధిలో కనీసం 60 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని సమావేశం కోరింది. అలాగే TGOs హైదరాబాద్ జిల్లా శాఖ సంఘ భవన నిర్మాణానికి నగరంలో లేదా పరిసర ప్రాంతాల్లో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది.

ఈ రెండు అంశాల్లో TGOs కేంద్ర సంఘం ప్రత్యేక చొరవ తీసుకొని, భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలని కోరారు.

*CPS రద్దు చేసి OPS పునరుద్ధరించాలి:*
ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

*ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్:*
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) అమలులో ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులు, నెట్‌వర్క్ ఆసుపత్రులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

*ఇతర రాష్ట్రాల సంక్షేమ పథకాలను అధ్యయనం చేయాలి:*
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉద్యోగుల సంక్షేమ పథకాలు, ఉత్తమ పరిపాలనా విధానాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ వ్యయంతో ఉద్యోగుల ప్రతినిధి బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపించాలని కోరారు. అక్కడి ఉత్తమ విధానాలను తెలంగాణలోనూ అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత, పరిపాలనా సౌలభ్యానికి సంబంధించిన ఈ తొమ్మిది తీర్మానాలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలు చేపట్టాలని TGOs హైదరాబాద్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది.