BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు

Select Suryaa Now
ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌  రిమాండ్‌ కు తరలింపు

చందానగర్‌,మేజర్ న్యూస్ : హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను చందానగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ రాత్రి 11.25 గంటల సమయంలో లింగంపల్లి రైతుబజార్‌ యూటర్న్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.మెహదీపట్నం నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రయాణికుడిని ఆటోలో తీసుకెళ్తున్న ముస్లాపురం రాజు రైతుబజార్‌ యూటర్న్‌ వద్ద ఆటోను మలుపు తిప్పుతుండగా, బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆటోను అడ్డగించాడు. ఎందుకు ఆటో ఆపావంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి, ఆటో తాళం తీసుకుని దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన పై ఎవరికి ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేరంటూ బెదిరించాడు.అనంతరం తన స్నేహితులైన రాహుల్‌, రాజేష్‌, రమణలను అక్కడికి పిలిపించాడు. వారంతా కలిసి రాజు పై రాళ్లతో దాడి చేయడంతో తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితుడి భార్య ముస్లాపురం కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.