telangana
మల్కాజిగిరి నియోజకవర్గంలో నూతనంగా 2,721 మందికి పింఛన్ల మంజూరు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో నూతనంగా 2,721 మందికి చేయూత పింఛన్ల మంజూరైనాయి. గురువారం మల్కాజిగిరి ఆనంద్ బాగ్‌లోని బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించిన
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజి గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మొత్తం 2,721 మందికి మంజూరైన పింఛన్ల పత్రాలను లబ్ధిదారులు అందుకు న్నారు. ఇందులో మల్కాజిగిరి సర్కిల్ లో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాం గులు కలిపి 850 మందికి, మౌలాలి సర్కిల్ లో ఒంటరి మహిళలు,వితంతువులు, దివ్యాంగులు కలిపి 1,063 మందికి, అల్వాల్ సర్కిల్ లో ఒంటరి మహిళలు, వితంతువు లు, దివ్యాంగులు కలిపి 808 మందికి,
పింఛన్ల మంజూరైనాయి. ఈ కార్యక్రమంలో ఎంఎంసీ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, డిప్యూటీ కమిషనర్లు జాకియా సుల్తానా, భోగిశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు నిరుపమ, సుధాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మల్కాజిగిరి బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్ బాగ్, మౌలాలి,గౌతమ్ నగర్ డివిజన్ల అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్ , నోరి సత్య మూర్తి, పోతుల వినోద్ యాదవ్, వైనాల ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశు రాం రెడ్డి, భాగ్యానంద్ రావు,అమీనుద్దీన్,
జీకే హనుమంతరావు, జేఏసీ వెంకన్న, మేకల రాముయాదవ్, మా రెడ్డి రాజశేఖర్ రెడ్డి, హేమంత్ పటేల్,చిన్న యాదవ్, శిఖ ప్రభాకర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, లక్ష్మణ్ యాదవ్, సురేష్, శ్రీనివాస్ రావు, కేబుల్ రమేష్, గౌస్ ఇమ్రాన్, మా శెట్టి అనిల్, జక్కుల కిరణ్, విజయ్ రెడ్డి, సందీప్, రాజు యాదవ్, శ్రీనివాస్, పవన్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు