BREAKING
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష మియాపూర్ భూ వివాదంపై ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల మెరుగు కి ఎం డీ చోరవ చూపాలి జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాతపట్నం విద్యార్థుల విజయకేతనం.. మాజీ ప్రధాని, భారతరత్న ఇంది రాగాంధీ జయంతి వేడుక నేడే టీ పీ సీ సీ ప్రచార కమిటీ సభ్యుడు గండి జగన్ యాదవ్ జన్మదినo మల్కాజిగిరి నియోజకవర్గంలో నూతనంగా 2,721 మందికి పింఛన్ల మంజూరు భక్తిశ్రద్ధలతో 'నగర్ కీర్తన్' మాజీ మంత్రి శైలజ నాథ్ తో, తలారి రంగయ్య భేటీ... గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్సం రాజు గౌడ్ నాలుగు దశాబ్దాల విధేయత.. నేడు వారసుడిగా సర్పంచ్ బరిలోకి!

భక్తిశ్రద్ధలతో 'నగర్ కీర్తన్'

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో 'నగర్ కీర్తన్'
 సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సిక్కు మత గురువు శ్రీ గురునానక్‌ దేవ్‌ జీ 557వ ప్రకాశ్‌ పర్వ్‌ (జన్మదిన వేడుకలు) సికింద్రాబాద్‌లో ఘనంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన చిక్కులు తమ ఆరాధ్య దైవాన్ని కీర్తిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. సికింద్రాబాద్‌ గురుద్వారా సాహిబ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు సర్దార్‌ కుల్దీప్‌ సింగ్‌ సలుజా ఆధ్వర్యంలో పంజ్‌ ప్యారేల నాయకత్వంలో శ్రీ గురు గ్రంథ్‌ సాహిబ్‌ పవిత్ర సాక్షిగా ఈ ధార్మిక ఊరేగింపు సాగింది. మనోహర్‌ టాకీస్‌, క్లాక్‌ టవర్‌, నటరాజ్‌ సినిమా హాల్‌, పట్నీ సర్కిల్‌, కింగ్స్‌వే, శారదా స్టోర్స్‌, మోండా మార్కెట్‌, ఆల్ఫా హోటల్‌ మీదుగా సాగిన నగర్‌ కీర్తన్‌ చివరకు సికింద్రాబాద్‌ గురుద్వారా సాహిబ్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా నాందేడ్‌, అమృత్‌సర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సిక్కుల సంప్రదాయ యుద్ధ కళలైన గత్కా ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. జథా తేరా జథా, స్త్రీ సత్సంగ్‌, మరాఠా జథా, జై తేగ్‌-గన్‌ గత్కా అఖారా, దశమేష్‌ కల్గిధర్‌ జథా బృందాలు పాల్గొన్నాయి. సిక్కు మహిళలు, పురుషులు గురుబాణి శబద్‌ కీర్తనలతో భక్తిభావాన్ని చాటుకున్నారు. నగర్‌ కీర్తన్‌లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.
ఊరేగింపు మార్గంలో పలుచోట్ల భక్తులకు అల్పాహారాలు, మిఠాయిలు పంపిణీ చేసి స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన అనంతరం గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, సాధ్‌ సంగత్‌ ఆధ్వర్యంలో భక్తులకు గురు కా లంగర్‌ (సామూహిక భోజనం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా కమిటీ అధ్యక్షుడు సర్దార్‌ కుల్దీప్‌ సింగ్‌ సలుజా, అశోక్‌ బజార్‌ శ్రీ గురు సింగ్‌ సభ అధ్యక్షుడు సర్దార్‌ గుర్చరణ్‌ సింగ్‌ బగ్గా, ప్రధాన కార్యదర్శి సర్దార్‌ రణబీర్‌ సింగ్‌ గాంధీ, కమిటీ సభ్యులు సర్దార్‌ జోగేందర్‌ సింగ్‌ ముజ్రాల్‌, సర్దార్‌ తరణ్‌దీప్‌ సింగ్‌ భాటియా తదితరులు పాల్గొన్నారు.