గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్సం రాజు గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా టీజీవైఎస్ కమిటీలో బాధ్యతలు
యాదాద్రి : తెలంగాణ గౌడ యువజన సంఘం (టీజీవైఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వలిగొండకు చెందిన పల్సం రాజు గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర కోర్ కమిటీ ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్ విజ్ఞప్తి మేరకు ఈ నియామకం చేపట్టారు.గౌడ యువతను, కల్లుగీత కార్మికులను సంఘటితం చేయడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంఘం నాయకత్వం సూచించింది. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్, జిల్లా కమిటీకి రాజు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా గౌడ జాతికి సేవ చేసే అవకాశంగా భావిస్తానని, గీత కార్మికుల హక్కులు, గౌడ యువత ఐక్యత, ఆత్మగౌరవం కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.