BREAKING
రవీంద్రభారతిలో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు వెంకటగిరి ఎంపీపీ ఎన్నికపై తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి కీలక వ్యాఖ్యలు లక్మి నృసింహుని స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క,పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ - రూ.4 కోట్లతో గెస్ట్ హౌస్ కి భూమి పూజ అర్హులందరికీ  ఇందిర బీమా యోజన అందిస్తాం .. ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన... ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహా పడిపూజ అంబర్పేట్ సీనియర్ సిటిజన్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అంది దేవేందర్  పుట్టినరోజు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి ఘన స్వాగతం కోడూరి లీలావతి దేవి శత జయంతి కార్యక్రమం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి 10+2 విద్యా విధానం పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జీవో జారీ చేయాలి. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆటో డ్రైవర్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌ రిమాండ్‌ కు తరలింపు అభివృద్ధి బాటలో కాకర్లపహాడ్ గ్రామం టౌన్ ప్లానింగ్‌ పనులపై సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సమీక్ష

మియాపూర్ భూ వివాదంపై ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే గాంధీ

Select Suryaa Now
మియాపూర్ భూ వివాదంపై ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే గాంధీ

మియాపూర్,మేజర్ న్యూస్ : సర్వే నంబర్ 100 భూములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, MA నగర్, స్టాలిన్ నగర్ కాలనీవాసుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీ ఆయా కాలనీ లో పర్యటించారు. తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌,రఘునాథ్ రెడ్డి  తో   కలిసి స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. తాము ఎన్నో ఏళ్లుగా ఆయా కాలనీల్లో నివసిస్తున్నామని, సుప్రీంకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. తమ సమస్యను మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని గాంధీని కోరారు. ఆయన హయాంలో కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు కల్పించారని, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే  గాంధీ మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. అదే సమయంలో అమాయక కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. కాలనీవాసుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అధైర్యపడవద్దని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఎలాంటి వదంతులు నమ్మకుండా సంయమనం పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు