హైదరాబాద్, మేజర్ న్యూస్ :ఎల్ బీ నగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీ పీ సీ సీ ప్రచార కమిటీ సభ్యుడు,ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు యాస్కి వీరాబిమాని గండి జగన్ యాదవ్ జన్మ దిన వేడుకలు శనివారం దిల్ సుఖ్ నగర్ లోని ఆయన స్వగృహం లో ఘనంగా జరుగనున్నాయి. వేడుకలను ఆయన అభిమానులు, శ్రేయోభిలాసులు, బంధువులు, మిత్రులు సంతోషంగా జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శనివారం ప్రత్యేక పూజల అనంతరం అందుల వసతి కేంద్రం లో వివిధ రకాల ఫలాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలు తీర్చి, ప్రజల్లో ఉంటేనే నాయకునికి ప్రజలు అన్ని రకాల అండ దండలు ఉంటాయాని అన్నారు. సీ ఎం రేవంత్ రెడ్డి, ఎల్ బీ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి మధు యాస్కి గౌడ్ సహకారం తో నియోజకవర్గం లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు శరవేగం గా జరుగుతున్నాయని అన్నారు. ఈ సారి కార్పొరేషన్ ఎన్నికల్లో గడ్డి అన్నారం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.