BREAKING
సంగారెడ్డి పట్టణ అభివృద్ధే లక్ష్యం – మౌలిక సదుపాయాలకు పెద్దపీట పిఎసిఎస్ లలో నామినేట్ వద్దు...పరోక్ష ఎన్నికలే ముద్దు.. భారతీయ శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలి రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం.. కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్స్ *చీకట్లను పారద్రోలి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి*.. *సంగారెడ్డి జిల్లా ,నియోజవర్గ ప్రజలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దీపావళి శుభాకాంక్షలు*! ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ దళితులకు కేటాయించాలి *దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో మిర్చీ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తితో జగ్గారెడ్డి ముచ్చట* ఆళ్లగడ్డలో తెదేపా ప్రభంజనం పరిగి డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి: టిజెఎమ్‌యు పూర్వ విద్యార్థుల సన్మానం..... మా ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి సంబరాలు విద్యావేత్త విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి...... కేటీఆర్‌ను కలిసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ బాణాసంచాలను కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి......

కూటమి నేతలకు చెంప పెట్టులా కార్పొరేషన్ ఫలితాలు* *అనంత హయాంలో జరిగిన నగర అభిరుద్దికి ప్రజలు గుర్తించారు* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

Select Suryaa Now
కూటమి నేతలకు చెంప పెట్టులా కార్పొరేషన్ ఫలితాలు*  *అనంత హయాంలో జరిగిన నగర అభిరుద్దికి ప్రజలు గుర్తించారు*  *మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : కూటమి నేతలకు చెంప పెట్టులా కార్పొరేషన్ ఫలితాలు నిలిచాయని మాజీ మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ మేయర్ మహమ్మద్ వసీం వైసీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్ తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికలలో ఒక మంచి నాయకునికి ఓటు వేయలేదు అన్న భావన ప్రజలలో ఉండేదని దానిని సరిదిద్దుకునే ఉద్దేశ్యం తో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి  ఓటు వేసి ఆదరించారన్నారు.నగర ప్రజలు నాడు ఐదేళ్ళ వైసీపీ  పాలనలో అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో నగరంలో జరిగిన  అభిరుద్ది ,సంక్షేమ పాలన,నగరంలో ప్రశాంతత చూశారన్నారు.అయితే కూటమి రెండున్నరేళ్ల పాలనలో నగర అభిరుద్ది, ప్రజా సంక్షేమం విస్మరించి దాడులు,దౌర్జన్యాలు,భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్ లు పెరిగి పోయి ప్రజల ఆస్తులకు రక్షణ లేక నగర ప్రశాంతత దెబ్బతిందన్నారు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తోపాటు కూటమి నేతల దౌర్జన్యాలకు విసిగిపోయిన ప్రజలు కూటమికి చెంపపెట్టు లా ఎన్నికల ఫలితాలతో బుద్ధి చెప్పారన్నారు.అంతేకాకుండా గతంలో నగరంలో ఏ ఎన్నిక జరిగినా ప్రశాంత వాతావరణంలో జరిగేవని, అయితే గతంలో  ఎన్నడూ లేని రీతిలో మొన్నటి కార్పొరేషన్  ఎన్నికలలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ  అభ్యర్థులపై దాడులు,రిగ్గింగ్,,సైక్లింగ్,బూత్ క్యాప్చర్  చేసి నగరంలో భయానక వాతావరణం సృష్టించారని ఆయన మండిపడ్డారు.స్వయంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లలోకి  వెళ్లారని ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. అలాగే బిజెపి నేతలు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, సినీ నటులు  సైతం ప్రచారం చేశారన్నారు.కూటమి నేతలు ఎన్నికల్లో  ఎన్ని దౌర్జన్యాలు చేసినా,ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ,ఎన్ని కుట్రలు చేసినా మా నాయకులు  అనంత వెంకటరామిరెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చి,కూటమి నేతల దౌర్జన్యాలను అడ్డుకుని ముందుండి నడిపించి మేయర్ గా రమేష్ గౌడ్ తోపాటు 21 మందిని కార్పొరేటర్ లుగా గెలిపించుకున్నారన్నారు .పార్టీబ్ శ్రేణులు కూడా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ముందుండి నడిపించి అభ్యర్థులను గెలిపించడంలో కీలకంగా పని చేశారని కొనియాడారు.గతంలో టీడీపీ హయాంలో కార్పొరేషన్ లో  3 గ్రూప్ లుగా ప్రజాప్రతినిధులు విడిపోయి అభిరుద్దిని విస్మరిస్తే  వైసీపీ హయాంలో కలసి పని చేసి మచ్చ లేకుండా పాలన అందించామని పేర్కొన్నారు.ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికైనాక  తొలి సమావేశంలోనే మాపై  నిరాదార ఆరోపణలు చేశారని,రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్కటి కూడా నిరూపించలేక పోయారన్నారు.తమ పాలక వర్గం హయాంలో ప్రారంభించి ప్రస్తుతం ఆగిపోయిన పనులు నూతన మేయర్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్లి మునుపటి వేగవంతమైన నగర అభిరుద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నూతన మేయర్ రమేష్ గౌడ్ తోపాటు 21 మంది వైసీపీ కార్పొరేటర్ లకు ఆయన అభినందనలు తెలుపుతూ, పార్టీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేశారు.మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మొఘల్ సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ చేపట్టిన  సేవ్ అనంతపురం నినాదాన్ని నగర ప్రజలు  ఆదరించారన్నారు.ఎమ్మెల్యే  దగ్గుపాటి ప్రసాద్ దగ్గరుండి ఎన్నికల్లో దౌర్జన్యాలు,దొంగ ఓట్లు,సైక్లింగ్ లను ప్రోత్సహించడం సిగ్గుచేటు అని,కూటమి తరపున గెలిచిన అభ్యర్థులు కూడా ఎలా గెలిచామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నగర అభిరుద్ది సాధ్యమవుతుందన్నారు.నిన్నటి ఎన్నికల్లో మేము దెబ్బతిని ఉండొచ్చని మాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు  అందరి లెక్క తెలుస్తామని ఆయన స్పష్టం చేశారు.సమావేశంలో కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి, షేక్ ఖాజా,బలరాం, జ్ఞానేశ్వర్,మాజీ కార్పొరేటర్లు ఇషాక్,కమల్ భూషణ్,రహంతుల్లా,నాయకులు కుళ్ళాయి స్వామి,అబ్బాస్,రియాజ్,కాకర్ల శీనా,,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్