కూటమి అభ్యర్థుల తరఫున టిడిపి నేత నాగరాజు విస్తృత ప్రచారం
ఉండి, మేజర్ న్యూస్: కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జెడ్పిటిసి అభ్యర్థుల తరఫున టిడిపి ఉండి మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు ఆదివారం కూటమి నాయకులతో కలిసి మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉండి గ్రామంలో ఉండి 2 ఎంపీటీసీ అభ్యర్థి వీర్రాజు తరపున జనసేన జడ్పిటిసి అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు తరపున ఆయన గడపగడపకు తిరుగుతూ వారికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలే పథకాలే కూటమి అభ్యర్థులను గెలిపిస్తాయని వారన్నారు కూటమి అభ్యర్థుల గెలుపుతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఓటర్లంతా కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును సైకిల్, గాజు గ్లాస్ గుర్తులు పై వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, మాజీ జెడ్పిటిసి కాగిత మహంకాళి, సీనియర్ నాయకులు ముదునూరి కృష్ణంరాజు, యూనిట్ ఇంచార్జ్ కర్రీ శ్రీనివాస్, లంకా ప్రకాష్, సారేపల్లి త్రిమూర్తులు, వెంకటేష్, ఉండి 3 టిడిపి ఏకగ్రీవ ఎంపీటీసీ అభ్యర్థి భాస్కర్ రాజు తదితరులు పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రసారం నిర్వహించారు.