BREAKING
ముగిసిన ‘ముహూరత్ ట్రేడింగ్’ పేదల ముఖాల్లో చిరునవ్వులు.. ఇందిరమ్మ గృహంలో దీపాలు వెలిగించిన మాద యాదగిరి, సుంకరబోయిన వెంకన్న వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు

జనసేన జయకేతనం.. నారాయణపురం ఎంపీటీసీ-2లో కూటమి అభ్యర్థి లాల్ స్వామి ఘనవిజయం.. విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన లాల్ స్వామి

Select Suryaa Now
జనసేన జయకేతనం.. నారాయణపురం ఎంపీటీసీ-2లో కూటమి అభ్యర్థి లాల్ స్వామి ఘనవిజయం.. విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన లాల్ స్వామి

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- నారాయణపురం ఎంపీటీసీ-2 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి లాల్ స్వామి ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో జనసేన శ్రేణుల్లో, కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ సందర్భంగా లాల్ స్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన నారాయణపురం ఎంపీటీసీ-2 పరిధిలోని ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ విజయం తన ఒక్కడిదే కాదని, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నారాయణపురం ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..