BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

జడ్పిటిసి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేయాలి

Select Suryaa Now
జడ్పిటిసి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేయాలి

 ఏలూరు, మేజర్ న్యూస్:  జిల్లాలో జెడ్పిటిసి, ఎంపిటిసి   ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను నవంబర్, 1వ తేదీ నాటికి సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల నిర్వహణపై శనివారం సాయంత్రం అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జెడ్పిటిసి, ఎంపిటిసి   ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను నవంబర్,1వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో  ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, కౌంటింగ్ సిబ్బందికి నవంబర్,2వతేదీన మొదటి శిక్షణ, 6వ తేదీన రెండవ విడత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  మునిసిపల్, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రత పరచాలని, వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులు తడిచిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.  కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు ప్రవేశించడానికి వేరు, వేరు మార్గాలు ఏర్పాటుచేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో  కౌంటింగ్ సమయంలో ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో ఎవరితోనూ ఇంటర్వ్యూ లు ఇవ్వకుండా చూడాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.