BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

జడ్పిటిసి , ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి 'తానేటి' ప్రచారం

Select Suryaa Now
జడ్పిటిసి , ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా  మాజీ మంత్రి 'తానేటి' ప్రచారం

ద్వారకాతిరుమల, మేజర్ న్యూస్: ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి నాయకులు సమాధానం చెప్పాలని వైయస్ఆర్సీపీ మాజీమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో ఆదివారం మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో జడ్పిటిసి అభ్యర్థి బుసన బోయిన విజయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు ఉక్కుర్తి వెంకటరావు, పొంగిలేటి రమేష్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ తమ పార్టీకి మేనిఫెస్టో భగవద్గీత తో సమానం అని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి నాయకులు  సమాధానం చెప్పి తీరాలని ప్రశ్నించారు. అనంతరం మండలంలోని తిమ్మాపురం గొల్లగూడెం పంగిడిగూడెం వేంపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బొండాడ వెంకన్న బాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, పి. ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.