జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : కేరళ లోని కన్నూరు లో నవంబర్ 1 నుంచి 4 వరకు జరిగిన సౌత్ జోన్ ఎక్యుప్డ్, క్లాసిక్ పవర్లిఫ్టింగ్ పోటిల్లో ..నెల్లూరు జిల్లా వాసులైన ఉన్నం జ్ఞానేశ్వర్ రెడ్డి,టి. రష్మి, పాల్గొని బంగారు, వెండి పథకాలు సొంతం చేసుకున్నారు. ఉన్నం జ్ఞానేశ్వర్ రెడ్డి 120+ సీనియర్ విభాగం లో పాల్గొని క్లాసిక్ లో బంగారు పతకాన్ని , ఎక్యుప్డ్ లో వెండి పతకాన్ని సాధించగా..రష్మి 63 కె. జి ల జూనియర్ విభాగం లో పాల్గొని ఎక్యుప్డ్ కాంపిటీషన్ లో వెండి పతకాన్ని సాదించారు. వీరు ఇరువురు బెంగళూరు లోని అమృత పవర్లిఫ్టింగ్ క్లబ్ లో.. కోచ్ బిరడ శ్రీకాంత్ వద్ద శిక్షణ తీసుకుంటూ..ఈ ఘనత సాధించడంతో వీరిని పలువురు ప్రశంసిస్తూన్నారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మేటిగా రాణిస్తున్న.. ఉన్నం జ్ఞానేశ్వర్ రెడ్డి,రష్మీ, లు మరిన్ని పోటీల్లో పాల్గొని.. జిల్లా కు మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.