గోపాలపట్నంలో బ్లింకిట్ సిబ్బంది బైక్ పార్కింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల చర్యలు
గోపాలపట్నం, మేజర్ న్యూస్ :గోపాలపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ జంక్షన్ సమీపంలో బ్లింకిట్ సంస్థ సిబ్బంది రోడ్డుపై ఇష్టానుసారంగా బైక్‌లు పార్కింగ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాట్సాప్ ఫిర్యాదుపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ సురేష్, ఎస్‌ఐ ఆర్. సూరిబాబు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనదారులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి పార్కింగ్ చేసిన వారికి జరిమానాలు విధించారు.బైక్‌ల పార్కింగ్ కారణంగా స్థానికులు రాకపోకలు సాగించేందుకు, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు వెళ్లేందుకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని నివాసితులు ఫోర్‌వీలర్ వాహనాలతో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడటంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించారు.ఈ సందర్భంగా బ్లింకిట్ మేనేజర్‌ను పిలిపించి, ఇకపై రోడ్డుపై ఎలాంటి వాహనాలు పార్కింగ్ చేయరాదని స్పష్టంగా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే టోయింగ్ వాహనం ద్వారా బైక్‌లను తరలించడంతో పాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.