BREAKING
కుకునూరులో యువకుడిపై దాడి.. బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్మనిర్భర్ బీహార్ నిర్మాణమే లక్ష్యం అంక్సాపూర్‌లో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన సర్పంచ్ కాపర్ ఆర్మర్డ్ కేబుల్స్ ధరలను 6 శాతం వరకు తగ్గించిన ఫినోలెక్స్ కేబుల్స్.. ఇఫ్ఫీ 2026లో క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో ఆరవ ఎడిషన్ ప్రారంభం గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకలు అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..! బీజేపీలో చేరిన యువకులు 8వ వేతన సంఘం... ఇఫ్ఫీ 2026లో ఏడుగురు సినీ దిగ్గజాలకు నివాళి అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ

ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు.

Select Suryaa Now
ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం.  26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు.

కోహీర్, ; కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోహీర్ మండలం చింతల్గట్టు గ్రామంలో భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం గ్రామానికి చెందిన విలేఖరి సంగన్న పాటిల్ నివాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భజనలు, భక్తి కీర్తనలు, నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ కార్యక్రమానికి జహీరాబాద్ మండల పరిధిలోని రాయిపల్లి (డి) గ్రామ భజన మండలి సభ్యులు చింతల గట్టు భజన మండలి ఉగ్గేల్లి హార్మోని పంతులు భజన భక్తులందరూ సంగన్న పాటిల్ ఆహ్వానం మేరకు హాజరై భక్తి పాటలు, కీర్తనలతో భగవంతుడిని స్మరించారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణ ప్రతీతి. ఈ పవిత్రమైన రోజున స్వామివారి నామస్మరణ చేయడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.కాగా, సంగన్న పాటిల్ గత సంవత్సరాలుగా ప్రతి ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా తన నివాసంలో శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన భక్తులు, అతిథులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.

భక్తి భావంతో సాగిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక సందడిని నింపింది.