BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

Select Suryaa Now
అద్వైత రథయాత్రను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద డిసెంబర్ 12వ తేదీ హైదరాబాద్ పటాన్చెరువు దగ్గర జిఎంఆర్ కన్వెన్షన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న అయ్యప్ప స్వామి కోటి నామార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం అద్వైత రథయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఈ కోటి నామార్చన లో పాల్గొని  విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ రికార్డు సాధించబోయే కార్యక్రమం కామారెడ్డిలో ప్రారంభం కావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. కేరళ సహాయ అర్చకులు, కాలడి ఆది శంకర మఠ్ వ్యవస్థాపకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి మాట్లాడుతూ.... డిసెంబర్ 12వ తేదీ  18,000 మంది అయ్యప్ప స్వాములతో కోటి నామార్చన కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిన వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఈ కోటి నామార్చన లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీనికోసం ఈ అద్వైత రథయాత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ రథయాత్ర డిసెంబర్ 10వ తేదీ బిహెచ్ఈఎల్ అయ్యప్ప ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కన్నయ్య శాస్త్రి, ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, కార్యనిర్వహణ అధ్యక్షుడు పట్నం రమేష్, అన్న ప్రసాద్ సేవాసమితి అధ్యక్షుడు రాజేందర్, నూకల ఉదయ్, పేపర్ శీను, మోటూరి శ్రీకాంత్ అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.