పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు
మదనపల్లి,మేజర్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్,28వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి దంపతుల ఆధ్వర్యంలో వారి నివాసంలో భక్తిశ్రద్ధలతో శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇందులో భాగంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,దైవ
ఆశీస్సులు పొందారు.అనంతరం రామకృష్ణ ఆచారి,తులసి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి,తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ సమాజసేవ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో పచ్చిపాల కుటుంబం ముందుంటుందని ప్రశంసించారు.సత్యనారాయణ స్వామి వ్రతం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిందని,ఈ వ్రతం నిర్వహించిన వారికి పాల్గొన్న వారికి ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు.స్వామివారి ఆశీస్సులతో పచ్చిపాల కుటుంబం వ్యాపార,రాజకీయ రంగాలలో దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయపాటి రానా,బండి పవన్ కుమార్,దీపు,దివాకర్,అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి