చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్
సూర్య రెంజల్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా గ్రామానికి నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లు సర్పంచ్ బురుగుపల్లి ధనుంజయ్ అందజేశారు. రెంజల్ మండలంలోని దండిగుట్ట గ్రామంలో ఎనిమిది చేయుత, రెండు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను పేదలకు అండగా నిలుస్తూ నూతన పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ ప్రజల- పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు లబ్ధిదారులు ఉన్నారు.