మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి
నగరం, మేజర్ న్యూస్:
ప్రపంచ మత్స్య పరిశ్రమలో భారతదేశం ప్రగతి, మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో యువత, మహిళలను ప్రోత్సహిస్తూ సుస్థిర అభివృద్ధి, సీబాస్, పీతలు, హేచరీ పద్ధతులు అవలంబించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో జంతు శాస్త్ర, ఆక్వా కల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఎంఫెడా, నెట్ ఫిష్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ ఫిషరీ పరిశ్రమలో ఐసింగ్, ప్లాస్టిక్ కాలుష్యం ద్వారా సముద్రాల్లో మత్స్య సంపద తరిగిపోతుందని, హార్బర్లలో వివిధ రకాల వసతులను పెంపొందించాలన్నారు.
విజయవాడ నాస్కా రాష్ట్ర కోఆర్డినేటర్ జె. కిరణ్ మాట్లాడుతూ స్థిరమైన చేపల వేట, జల వనరుల సంరక్షణ, మత్స్యకారుల సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్న బాబు అధ్యక్షత వహించగా, అతిథులను కళాశాల సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ సైకిల్ మానికొండ పి సురేష్ కళాశాల ఆయా శాఖల అధిపతులు డాక్టర్ కె. సురేష్ బాబు, సునీత, అధ్యాపకులు సిహెచ్ సుధీర్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు