108 లో సురక్షితం ప్రసవం తల్లి బిడ్డ క్షేమం...
దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స..
108 సిబ్బందితో ప్రసవించిన బిడ్డ
కనగల్ మేజర్ న్యూస్: గుర్రంపూడ్ మండలం ఎలమొని గూడెం గ్రామానికి చెందిన యు. జ్యోతి పురిటి నొప్పులతో శనివారం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందివ్వగా, కనగల్ 108 సిబ్బంది ఈఎంటి సత్యనారాయణ, పైలట్ ఎజాస్ సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స నిర్వహిస్తుండగా అక్కడే పండంటి మగ బిడ్డకు జ్యోతి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు. తల్లి బిడ్డను దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. భర్త సైదులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.