BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన ఫీజుల బకాయిలపై విద్యార్థుల సమరభేరి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కుమార్తె పెళ్లికి షర్మిళ ఆహ్వానిస్తే రోత రాతలా? -మీడియా సమావేశంలో గొడ్డలిపార్టీ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం షర్మిల పెళ్లి ఆహ్వానంపై 'సాక్షి' కథనాలపై సీఎం చంద్రబాబు స్పందన భూ సర్వేపై రైతులకు నోటీసుల పంపిణీ జిల్లాలో 151 చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కారం

ముదిరాజులకు రాజ్యాధికారంలొ సముచిత స్థానం కల్పించాలి

Select Suryaa Now
ముదిరాజులకు రాజ్యాధికారంలొ సముచిత స్థానం కల్పించాలి

 

-- తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్

మహబూబ్‌నగర్, సూర్య ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముదిరాజుల ఓట్లు కోరే రాజకీయ పార్టీలు అధికారంలో భాగస్వామ్యం కల్పించే విషయంలోనూ చిత్తశుద్ధి చూపాలని అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజులు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోవడానికి సిద్ధంగా లేరని, తమ జనాభా, సామాజిక బలం, రాజకీయ ప్రాధాన్యతకు అనుగుణంగా చట్టసభల్లో, ప్రభుత్వ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ముదిరాజుల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ముదిరాజులను ప్రస్తుత బీసీ-బి నుంచి తగిన బీసీ గ్రూపులోకి మార్చాలని, బీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కోరారు. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియలో ముదిరాజ్ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన అధిక సంఖ్యలో రాజకీయ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం తప్పనిసరని పేర్కొన్నారు. హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో అమలు చేయాలని, ముదిరాజుల హక్కుల సాధన కోసం సమాజమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పండుగ సాయన్న సేవా సమితి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ పాతూర్ కుమార్, మత్స్య సహకార సంఘం సొసైటీ జనరల్ సెక్రటరీ బాల, పీయూజేఏసీ ప్రకాష్ ముదిరాజ్, రాము, ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మైత్రి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, వాల్మీకి సంఘం అధ్యక్షులు ఊరిని చెన్నయ్య, గుత్తేదార్ సురేష్ ముదిరాజ్, ఏఐఎస్ఎఫ్ లక్ష్మణ్ ముదిరాజ్, గోపి, టంకర రాజు, దోమ వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలేష్, శివన్న, రజక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.