రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,రామాచార్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి కూటమి పార్టీల అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన సీతక యుగంధర్ పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు.శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదనపల్లి నియోజకవర్గంలో 53 స్థానాలకు కూటమి పార్టీల సర్పంచ్ అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు.రామాచర్లపల్లె లో తెలుగుదేశం అభ్యర్థి ఉన్నప్పటికీ కూటమి ధర్మంలో భాగంగా అధిష్టాన నిర్ణయం మేరకు జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.జనసేన పార్టీ రాయలసీమ కో-ఆర్డినేటర్ రాందాస్ చౌదరి ఈ విషయాన్ని సమన్వయం చేస్తున్నట్లు ఆయన వివరించారు.కావున మూడు పార్టీల నాయకులు,కార్యకర్తలు సమిష్టిగా పనిచేసే కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి