డి పి ఆర్ సి నూతన భవనం నిర్మాణం సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం
బాపట్ల, మేజర్‌న్యూస్ :
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా నిన్న బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పూషడపు రోహిణి గారు ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు డి పి ఆర్ సి నూతన భవనం నిర్మాణం సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేసి ఆమోదించి ఉన్నారు. తదుపరి కార్యాలయ సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించి అందరం సమన్వయ కృషితో జిల్లా అభివృద్ధి కొరకు పాటుపడదామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఈవో శ్రీమతి సిహెచ్ విజయలక్ష్మి గారు, కార్యాలయ సూపరిండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.