BREAKING
ముదిరాజులకు రాజ్యాధికారంలొ సముచిత స్థానం కల్పించాలి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు బాడంగి, లక్ష్మీపురం గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. -రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన.. గంగానదిపై ‘నితీష్ సేతు’ ప్రారంభం డి పి ఆర్ సి నూతన భవనం నిర్మాణం సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం నకిలీ లోన్ యాప్స్ ఉచ్చులో పడకండి.. పోలీసుల కీలక హెచ్చరిక - Si నరేష్ 7 వ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి రాజీనామా ఐఐటి రామయ్య ఆశయాలను అమలు చేయాలి : కె.ఎస్. లక్ష్మణరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జాబ్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి.. ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి 108 లో సురక్షితం ప్రసవం తల్లి బిడ్డ క్షేమం... రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ!

రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి

Select Suryaa Now
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి

గుంటూరు : మేడికొండూరు మండలం లోని మేడికొండూరు గ్రామంలో "రబీ పంటల సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులు " అనే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఆత్మ వారి ఆధ్వర్యంలో బి టి టి కన్వీనర్, సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహన రావు ఆధ్వర్యంలో రైతులకు శిక్షనా కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వ్యవసాయ అదికారిని యమ్. పద్మావతి రైతులను ఉద్దెశించి మాట్లాడుతూ ఈ రబీలో వేయబోయే పంటలు గురించి, వాటిలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు, రైతులు అపరాలు పంటలు వేసుకోవాలని, శనగ పంటలో విత్తన శుద్ధి చేసుకోవాలని, నీటి వసతి లేని కారణంగా ఆరుతడి పంటలు, మిల్లెట్స్ పంటలు వేసుకోవాలని, వాటిలో సమగ్ర పోషక యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన గురించి అవగాహన కార్యక్రమం, కొత్తగా వచ్చిన ఎరువులు పంపిణీ విధానం గురించి రైతులకు వివరించారు,ఈ కార్యక్రమం లో సహాయ వ్యవసాయ సంచాలకులు యన్ మోహనరావు మాట్లాడుతూ రైతులు కొత్తగా వచ్చిన ఎరువులు పంపిణీ  గురించి అవగాహన కలిగి ఉండి, అందరూ ఎఫ్ ఎఫ్ ఎస్  యాప్ ద్వారా ఫార్మర్ ఐడి ద్వారా బుకింగ్ చేసుకోవాలని, యాప్ ని ప్లేస్టోర్ లో ఇన్స్టాల్ చేసుకుని, పంటల వారీగా, విస్తీర్ణం వారీగా రైతులు క్యూ కోడ్ ద్వారా ఎరువులు పొందవచ్చునని తెలిపారు అలాగే కౌలు రైతులు అందరూ సి సి ఆర్ సి కార్డు తీసుకోవాలని, లేకపోతే భూ యజమానుల ఓటీపీ ద్వారా ఎరువులు పొందవచ్చునని తెలిపారు,  రైతులందరూ ప్రధాన మంత్రి ఫసల్ భీమయోజన పథకాన్ని ఈ రబీ -26 లో 5 పంటలకు పెసర, మినుము, శనగ, జొన్న, మొక్కజొన్న పంటలకు దిగుబడుల ఆధారంగా పంటల బీమా పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. పీఎం ఎఫ్ బివై గురించి వివరించి, రైతులందరూ డిసెంబర్ 15 వ తారీకు లోగా పైన పేర్కొన్న 5 పంటలకు ప్రీమియం చెల్లించి పంటల భీమాలో చేరాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో భాగంగా లాం ఫామ్ శాస్త్రవేత్త మనోజ్ మాట్లాడుతూ జీవన ఎరువుల ఉపయోగం, వాటి వాడకం విధానం, ప్రాముఖ్యత గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పశుసంవర్ధక అధికారి పశువులలో వచ్చే వ్యాధులు, గురించి వివరించారు, ఈ కార్యక్రమం లో ఆత్మ వ్యవసాయ అధికారిని రాజవంశీ పాల్గొని రైతులకు ప్రత్తి, అపరాలలో సమగ్ర పంటల యాజమాన్యం గురించి తెలియజేశారు.తదుపరి ఏ డి ఏ యన్ ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్  (ఫ్రేమ్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) యాప్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమం లో వ్యవసాయ అధికారి కె  లక్ష్మీ, ఏఈవో  లు మురళి, పద్మజ ,వి ఏ ఏ  లు, అధిక సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు..

 

సూర్య నాయక్