నకిలీ లోన్ యాప్స్ ఉచ్చులో పడకండి.. పోలీసుల కీలక హెచ్చరిక - Si నరేష్
సూర్య తాడ్వాయి: తాడ్వాయి రుణాల పేరుతో సామాన్యులను ఆకర్షించి, ఆపై తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న నకిలీ లోన్ యాప్స్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి పోలీసులు హెచ్చరించారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సులభంగా రుణం లభిస్తుందన్న ఆశతో గుర్తింపు లేని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని si నరేష్ సూచించారు.
వేధింపుల తీరు ఇలా..అత్యవసర డబ్బు అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు, కేవలం ఆధార్, పాన్ కార్డు వివరాలతో నిమిషాల్లో రుణం ఇస్తామని నమ్మిస్తున్నారు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో బాధితుల ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ, మెసేజ్‌ల యాక్సెస్ తీసుకుంటున్నారు. రుణం తీసుకున్న కొద్దిరోజులకే అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా, గడువు ముగియకముందే వేధింపులు మొదలుపెడుతున్నారు. బాధితుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి బంధువులు, స్నేహితులకు పంపిస్తామంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు.వేధింపులకు గురైన వారు వెంటనే *1930* కు కాల్ చేయండి తడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.