7 వ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి రాజీనామా
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ఇటీవల జరిగిన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 7 వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిచిన కట్టమంచి హరిణి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. పదవులు తనకు శాశ్వతం కాదని, ఆత్మ గౌరవమే ముఖ్యమన్నారు. ప్రజల అభిమానం, ప్రజల నమ్మకమే శాశ్వతమని, తనకు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటికీ వార్డు ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం గతంలో లాగే ఇకపై కూడా పనిచేస్తాననని హరిణిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా హరిణిరెడ్డి రాజీనామాకు గల స్పష్టమైన కారణాలు తెలపకపోవడం గమనార్హం.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.