BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన ఫీజుల బకాయిలపై విద్యార్థుల సమరభేరి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కుమార్తె పెళ్లికి షర్మిళ ఆహ్వానిస్తే రోత రాతలా? -మీడియా సమావేశంలో గొడ్డలిపార్టీ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం షర్మిల పెళ్లి ఆహ్వానంపై 'సాక్షి' కథనాలపై సీఎం చంద్రబాబు స్పందన భూ సర్వేపై రైతులకు నోటీసుల పంపిణీ జిల్లాలో 151 చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కారం

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి

Select Suryaa Now
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి  విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి

నేరేడుచర్ల, మేజర్ న్యూస్


మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, నేరేడుచర్ల ఎస్ఐ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మై భారత్ కేంద్రం, సూర్యాపేట ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ యువ’ (మాదకద్రవ్యాల రహిత యువత) ఇతివృత్తంతో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఎస్ఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకొని చట్టాలను గౌరవించాలని సూచించారు.అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి చెందిన పోలీస్ కళాబృందం పాటల ద్వారా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించింది.కళాశాల ప్రిన్సిపాల్ నీరజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనపర్తి శ్రీనివాసులు సమన్వయం చేశారు. కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.