BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్

Select Suryaa Now
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్

కృష్ణ సూర్య న్యూస్ :
మురహరి దొడ్డి గ్రామంలో ఎవరు మరణించినా అంత్యక్రియల (మట్టి ఖర్చు) కోసం ఆర్థిక సాయం అందిస్తానంటూ సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గ్రామ సర్పంచ్ కుమ్మరి నర్సమ్మ పెద్ద నర్సప్ప నిలబెట్టుకున్నారు.మండలంలోని మురహరి దొడ్డి గ్రామానికి చెందిన బోడినోళ్ల తిమన్న శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కుమ్మరి నర్సమ్మ పెద్ద నర్సప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మట్టి ఖర్చుల నిమిత్తం మృతుడి భార్య ఉసెనమ్మకు రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ పెద్ద లేదా సభ్యులు మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చులు పేద కుటుంబాలకు భారంగా మారుతున్నాయని, ఆ కష్టాన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల వేళ ఈ హామీ ఇచ్చానని సర్పంచ్ స్పష్టం చేశారు. తన సర్పంచ్ పదవీకాలం ముగిసే వరకు గ్రామంలో ఎవరు మృతి చెందినా వారి కుటుంబాలకు ఈ రూ.5 వేల ఆర్థిక సాయం నిరంతరం అందుతూనే ఉంటుందని గ్రామ సర్పంచ్ భరోసా ఇచ్చారు. ఈ మానవీయ నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాల లక్ష్మప్ప, రాకేష్ , శ్రీను తదితరులు ఉన్నారు.


నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం