telangana
కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తికావడంతో, సర్వేకు సంబంధించిన నోటీసులపై గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ అనిరుద్ధ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి రైతుకు త్వరలోనే సర్వే మ్యాప్‌తో కూడిన భూధార్ కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. సర్వేకు సంబంధించి రైతులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతుల అభ్యంతరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, సర్వేయర్ తులసిరామ్, జీపీఓలు మోహన్, నవీన్, కిషన్, హరిచరణ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.