telangana
పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
సూర్య వేల్పూరు : వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ జిన్నా జనార్ధన్ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ జిన్నా జనార్ధన్ మాట్లాడుతూ.. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.చేయూత పెన్షన్లు మంజూరు చేసినందుకు లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్నా జనార్ధన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.