BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ

Select Suryaa Now
కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగోపాలపురం మండలంలో నిర్వహిస్తున్న ప్రైమరీ కాంప్లెక్స్, మాథ్స్ మరియు సోషల్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలను జిల్లా మానిటరింగ్ ఆఫీసర్  లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.

ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా దీటుగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టీపీడీ కోర్సులు పూర్తి చేయాలని సూచించారు.

అలాగే ప్రసస్థ యాప్, టీపీడీ కోర్సు, సాల్ట్  అబ్జర్వేషన్, జీఎఫ్‌ఎల్‌ఎన్, సీబీఏ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు పలు మార్గదర్శకాలు అందజేశారు. అనంతరం పాఠశాలలోని పాల్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి  ఏ. మహేశ్వరరావు, క్లస్టర్ చైర్మన్ పి. వెంకట కనక పద్మ, మాస్టర్ ట్రైనర్ అమలాపురపు వెంకటేశులు, సీఆర్పీలు కొయ్య నాగరాజు, లక్ష్మణ్, సుబ్రహ్మణ్యం, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.