BREAKING
రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ! రామాచార్లపల్లి సర్పంచ్ స్థానం జనసేనకు కేటాయింపు : కూటమి అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన సీతక యుగంధర్ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

జిల్లాలో 'సంజీవని' వైద్య సేవ‌ల‌కు సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్

Select Suryaa Now
జిల్లాలో 'సంజీవని' వైద్య సేవ‌ల‌కు సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్

గుంటూరు : జిల్లాలో 'సంజీవని' వైద్య సేవ‌ల‌కు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సంజీవని' వైద్య సేవ‌ల‌పై కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 'సంజీవని'  కింద వైద్య సేవ‌ల‌ను డిసెంబరు 5 నుంచి ప్రారంభించేందుకు వీలుగా వైద్య‌, ఆరోగ్య శాఖలో ప‌నిచేసే అన్ని స్థాయిలలోని వైద్యులు, పారా మెడిక‌ల్ సిబ్బంది, అధికారులకు శిక్ష‌ణ పూర్తి చేయాలని ఆదేశించారు. సంజీవ‌ని కింద చేప‌ట్టే కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను అన్‌లైన్‌లో ఎలా న‌మోదు చేయాలి, రోగులకు ఎలాంటి స‌ర్వీసులు అందించాలి, ప‌రీక్ష‌లు ఎలా జ‌ర‌పాలి, అపాయింట్‌మెంట్లు ఎలా ఇప్పించాలి, తీసుకోవాల్సిన ఇత‌ర చ‌ర్య‌ల‌పై శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల ద్వారా వైద్యులు, ఇత‌ర‌ సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వాలని చెప్పారు. డిజిటల్‌ పద్ధతిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, పని విధానాలను అనుసంధానించడం, ఆరోగ్య గుర్తింపు సంఖ్య నమోదు చేయడం వంటి అంశాల్లో  ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు శిక్షణను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంజీవని సేవల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంజీవని సేవల కోసం ప్రత్యేక గదులను సిద్ధం చేసి, నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా యూపీఎస్‌ లేదా ఇన్వర్టర్‌ సదుపాయాలను కల్పించాలన్నారు. సంజీవని సేవలకు అవసరమైన కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, ప్రింటర్లు, స్కానర్లు, యూపీఎస్‌లు, వెబ్‌ కెమెరాలు, స్పీకర్లు, హెడ్‌ఫోన్లు తదితర పరికరాలను సమకూర్చాలని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలులో భాగంగా రోగి సేవల సమన్వయకర్తలు (సిహెచ్ ఓలు-పేషెంట్ కోఆర్డినేట‌ర్లు) రోగులకు అందించే సేవల సమన్వయం, వైద్య సమాచార నమోదు, సంబంధిత ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల మధ్య స‌మ‌న్వ‌యం చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా సామాజిక ఆరోగ్య అధికారులు, మధ్యస్థాయి ఆరోగ్య సేవల సిబ్బంది పనితీరు చక్కగా ఉండాలని అన్నారు. సంజీవని సేవల అమలులో ఎదురయ్యే సమస్యలను గుర్తించడం, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవడం, సేవలు సజావుగా సాగేలా చూడటం పక్కాగా జరగాలని ఆదేశించారు. సంజీవని ప్రాజెక్టుతో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలకు చెందిన సుమారు 74 వైద్య అప్లికేష‌న్స్‌(పోర్ట‌ల్ ఇత‌ర‌), అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. తొలి దశలో వైద్య సేవలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, పర్యవేక్షణకు అవసరమైన ముఖ్యమైన వ్యవస్థలను అనుసంధానించడం, నెక్స్ట్‌జెన్‌, ఈ-ఔషధి వంటి వ్యవస్థలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్య చరిత్ర నిక్షిప్తం చేయడమే కాకుండా, ప్రత్యేక గుర్తింపు నంబరుతో ఎక్కడకు, ఏ వైద్యం కోసం వెళ్లినా రిఫరెన్స్ గా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దీనిని చక్కగా వినియోగించుకుని ఉపశమనం పొందాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మక్కెన పద్మావతి మాట్లాడుతూ జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ ల శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, ఎన్.టి.ఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ ప్రకాష్, వైద్య ఆరోగ్య శాఖ డి.పి.ఎం సుజాత, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్