ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో నూతనంగా పదవులు అలంకరించిన పలువురు ప్రముఖులను ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు,21వ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ నాగూర్ వలి (షో ఆప్ శీనా) మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,అన్నమయ్య జిల్లా తొలి జడ్పీ చైర్మనుగా ఎన్నికైన సుగవాసి ప్రసాద్ బాబు,ఛైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యలమంజుల బాలాజీలను వేర్వేరుగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా అభివృద్ధిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.జిల్లా తొలి జడ్పీ చైర్మనుగా ఎన్నికైన సుగవాసి ప్రసాద్ బాబు సమర్థవంతమైన,చురుకైన నాయకుడని ఆయన సారధ్యంలో జిల్లా అన్ని రంగాల్లో ముందంజ వేయాలని ఆకాంక్షించారు.అదేవిధంగా చైర్మన్ బార్ కౌన్సిల్ అఫ్ ఏపీగా నియమితులైన బాలాజీ ఆ పదవికి వన్నె తీసుకొస్తారని,ఏపీలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఓకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యక్తులను కలవడం పట్ల నాగూర్ వలి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్,కౌన్సిలర్ రంగస్వామి నాయుడు,చిప్పిలి చెండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంఛార్జి