BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

Select Suryaa Now
వ్యాధులు ప్రబలకుండా సమష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

గుంటూర :  జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా (ఔట్ బ్రేక్) సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. డిస్ట్రిక్ట్ జాయింట్ ఔట్ బ్రేక్ రెస్పాన్స్ టీమ్ (డి.జె.ఓ.ఆర్.టి) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా ఏ వ్యాధి ప్రబలినా తక్షణం సమాచారం అందాలన్నారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వ్యాధులు మానవులకు ప్రబలినా లేదా పశువులు, పౌల్ట్రీలకు ప్రబలినా తక్షణం సమాచారం ఇవ్వాలని చెప్పారు. వ్యాధికి కారణాలు వెంటనే కనుగొనాలని, దానికి తక్షణం వైద్య సహాయం అందించాలని స్పష్టం చేశారు. వ్యాధి భారిన పడిన వ్యక్తి తీవ్రత మేరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామ పంచాయతీ విభాగం, పురపాలక సంఘం తదితర అన్ని శాఖలు తక్షణం స్పందించి వ్యాధి తీవ్రత వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖలకు అప్పగించిన పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.తెనాలిలో గల జిల్లా ఆసుపత్రితో పాటు ప్రత్తిపాడు, పొన్నూరు ఆసుపత్రుల్లో మాతృ,శిశు ఆరోగ్య కేంద్రాలు జనవరి 1 నాటికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో అత్యున్నత వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు విభాగాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి, మంచి వైద్య సేవలకు స్థావరంగా మార్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మక్కెన పద్మావతి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, ఎన్.టి.ఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ ప్రకాష్, వైద్య ఆరోగ్య శాఖ డి.పి.ఎం సుజాత, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్