సర్పంచ్ ఎన్నికలకు 23 నామినేషన్లు దాఖలు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
చీపురుపల్లి మండలంలో సర్పంచ్ పదవికి 19 పంచాయతీలకు తొలిరోజు 23 నామినేషన్లు వచ్చాయి. చీపురుపల్లి మేజర్ పంచాయతీ లో 2, చిన్ననడిపల్లి కి రెండు, దేవరపోదిలంలో ఒకటి, గొల్లలపాలెంలో మూడు, ఇటకర్లపల్లి 2, కరకాం 3, కర్లం మూడు, నిమ్మలవలస రెండు, పీకే పాలవలస 4, రామలింగాపురం ఒకటి మొత్తం మొదటి రోజు సర్పంచ్ పదవికి 23 నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులకు గాను మండలంలో అన్ని పంచాయతీలకు 92 రాగా గొల్లలపాలెంలో అత్యధికంగా 30 నామినేషన్లు వచ్చాయి. చీపురుపల్లి మేజర్ పంచాయతీ వార్డులకు మూడు, దేవరపోదిలం ఏడు, ఇటకర్లపల్లి మూడు, కరకాం రెండు, కర్లాం 12, నిమ్మలవలస 16, పీకే పాలవలస 13, రావివలస ఆరు నామినేషన్లు పంచాయతీ వార్డులకు వచ్చాయి.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా