అంతంపల్లిలో చేయూత ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ
సూర్య- బిక్కనూర్ : మండలంలోని అంతంపల్లి గ్రామంలో, శనివారం చేయూత ఆసరా పెన్షన్ల పత్రాలను, గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్లు ఎంతో ఉపయోగపడతాయి అన్నారు.ఈకార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిట్టెడి సుధాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సెక్రెటరీ భార్గవ్ రెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు