BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం

Select Suryaa Now
గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం
సూర్య,భీమ్‌గల్ : నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆయుధమైన శ్రీ చక్రస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కొండ చుట్టూ సాగిన ప్రదక్షిణ భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది.ఉదయం గర్భాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తులసీ, విష్ణువుల కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, బలిప్రదానం నిర్వహించారు. ఉత్సవ యోగ సంరక్షణలో భాగంగా శ్రీ చక్రస్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి నింబాచల గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. స్వామివారి వెంట భక్తులు గోవిందా.. గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణలో పాల్గొన్నారు. మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ చేయడం విశేష పుణ్యఫలదాయకమనే విశ్వాసంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా, ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
-గిరి ప్రదక్షిణకు పోలీసు బందోబస్తు
గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భీంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై చిరంజీవితో పాటు సివిల్ పోలీసులు, మహిళా పోలీసులు విధులు నిర్వహించి ప్రదక్షిణ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు.