BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..! హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..!

Select Suryaa Now
కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు..!  హుస్నాబాద్ ప్రాంత కబడ్డీ క్రీడాకారులకు ఘన సన్మానం..!

హుస్నాబాద్ ; హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కబడ్డీ క్రీడాకారులు ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా వారిని హుస్నాబాద్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది.కబడ్డీ క్రీడలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ఎంపికై, ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు హుస్నాబాద్ ప్రాంతానికి గర్వకారణమని ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇంతటి స్థాయికి ఎదగడం వెనుక వారి క్రమశిక్షణ, కఠోర సాధన, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉందని కొనియాడారు.
క్రీడాకారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. రాబోయే పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సెంట్ జోసెఫ్ ప్రిన్సిపాల్ విజయేంద్ర రెడ్డి, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అరవింద్, సెక్రటరీ రాజారెడ్డి, ట్రెజరర్ సంపత్, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ మరియు ఈసీ మెంబర్లు అజయ్, స్రవంతి, కవిత, మాధవి, లావణ్య, కళావతి పాల్గొన్నారు.