BREAKING
ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్ ప్రతి ఇంటికి బీమా రక్షణే ప్రభుత్వ లక్ష్యం పచ్చిపాల నివాసంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు దంపతులు,కౌన్సిలర్లు చీరాల వాడరేవు రహదారిలో రోడ్డు ప్రమాదం కాంప్లెక్స్ సమావేశాలు తనిఖీ కృత్రిమ మేధ (ఏఐ) టోకెన్ ప్రమాణాలను బలోపేతం చేసేందుకు చైనా సన్నాహాలు.. అంజన్న నిజస్వరూపాన్ని దర్శించుకుంటున్న భక్తులు మధ్య, తూర్పు ఐరోపా వ్యాపారంలోని మిగిలిన వాటా విక్రయంపై సీవీసీతో ఎంటైన్ చర్చలు చేయూత నూతన పెన్షన్లు అందజేసిన సర్పంచ్ మాంటె డీ పాస్కి కొనుగోలుకు ఇంటెసా శాన్‌పాలో నగదు, షేర్ ఆఫర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ప్రముఖులను సన్మానించిన టిడిపి యువనేత నాగూర్ వలి కొత్తపల్లిలో భూ భారతి రీ సర్వే పూర్తి. నోటీసులపై గ్రామసభ నిర్వహణ తాజా ఈయూ బడ్జెట్ ప్రతిపాదన తీవ్ర నిరాశజనకం

బీజేపీలో చేరిన యువకులు

Select Suryaa Now
బీజేపీలో చేరిన యువకులు
సూర్య,భీమ్‌గల్ : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో, బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో చేరారు. శివసరి ఫణింద్ర, డాక్టర్ శ్రీకాంత్ రమావత్, శివసరి అజేంద్ర, బాషవేణి అర్జున్, ఆలూరి సాయి కృష్ణారెడ్డి, గాదెపల్లి సుధాకర్, భోస్లే కమలాకర్, నల్లకుంట్ల నందకిషోర్, సాయి కృష్ణ గుప్తా, శివసరి లింబాద్రి, జంగిటి శ్రీనివాస్ తదితరులతో పాటు భీంగల్ పట్టణం, పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది యువకులు బీజేపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. వారికి నాయకులు కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో నిజామాబాద్ జిల్లాకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో పాటు రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.యువత పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం బాల్కొండ నియోజకవర్గంలో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, సీనియర్ నాయకులు సంజయ్, మండల, పట్టణ కమిటీ నాయకులు, బూత్ అధ్యక్షులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.