చిన్న మోదుగుపల్లిలో వైఎస్సార్‌సీపీకి భారీ షాక్
ఐదు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది టీడీపీలో చేరిక
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
వత్సవాయి మండలం చిన్న మోదుగుపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల నుంచి సుమారు 20 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.జగ్గయ్యపేట పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసంలో ఈరోజు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బొజ్జ అప్పారావు, మెట్టెల వీరభద్రం, మెట్టెల నరసింహారావు, రాయల శ్రీనివాసరావు, మెట్టెల సైదా కుటుంబాలకు చెందిన వారు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.చిన్న మోదుగుపల్లి గ్రామంలో ఒకేసారి ఐదు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది టీడీపీలో చేరడంతో గ్రామ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమంలో పులమోలు కోటేశ్వరరావు, ఏలూరి వెంకటేశ్వర్లు, బొజ్జ కిషోర్, కట్టా తిరుపతయ్య, రాయల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.