BREAKING
ఐటీఐ టాపర్లను సత్కరించనున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి భజన కార్యక్రమం. 26 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి మత్స్యకారుల ఐక్యతతోనే హక్కుల సాధన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ నిధులు కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం...క్షణాల్లోనే అంజన్న నిజ స్వరూప ఫోటో వైరల్ .. రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చెయ్యాలి యోగాతో మానసిక ప్రశాంతత ఎంతగానో ఉపయోగపడుతుంది - బ్రహ్మ జ్ఞాన భారత సత్య సంస్థాపకులు గోకులం శంకరాచార్యులు బీహార్ అభివృద్ధికి భారీ ఊతం పాట్నా విమానాశ్రయంలో నితీష్ కుమార్‌తో భేటీ మానసిక వికలాంగుల పిల్లలకు అందిస్తున్న సేవలు అభినందనీయం - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా - ఉచిత కంటి అద్దాల పంపిణీ మహా పాదయాత్రను జయప్రదం చేయండి కాంగ్రెస్ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టకు భంగం - బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ వైశాలిలో నితీష్ సేతు వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

ఫీజుల వివరాలు ప్రకటించాకే విద్యాశాఖలో విలీనం చేయాలి

Select Suryaa Now
ఫీజుల వివరాలు ప్రకటించాకే విద్యాశాఖలో విలీనం చేయాలి
సూర్య కరీంనగర్ : పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజుల వివరాలు ప్రకటించిన తర్వాతే ఇంటర్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని భాగ్యనగర్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలు, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలను బహిర్గతం చేయాలని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1లోని 16, 18 నిబంధనలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేసి, పాఠశాలలు జీవో నంబర్ 1, కళాశాలలు జీవో నంబర్ 29 ప్రకారం అనుమతులు పొందిన తర్వాతే 10+2 విద్యావిధానంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరారు.