సూర్య గన్నేరువరం : మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నీకేష్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రతిష్టను ప్రపంచస్థాయిలో పెంచేందుకు కృషి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘంపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ నెల 23న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సుగుత్తి జగదీశ్వరచారి, సొల్లు అజయ్ వర్మ, ఏలేటి చంద్రారెడ్డి, బొమ్మాడి సురేందర్ రెడ్డి, పుల్లెల రాము, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, గాలిపెల్లి శంకర్, కర్ర అనూష రెడ్డి, శక్తి కేంద్ర ప్రభారీలు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.