telangana
ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు
సూర్య నస్పూర్ : మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. మేయర్ దర్ని మధుకర్, సుజాత దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సురేఖమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు అంకితమైన నాయకురాలిగా, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సురేఖమ్మ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాచకొండ గోపాల్‌రావు, ఖలీద్, కొండ్ర రాజేశ్వరి, లింగయ్య, డివిజన్ అధ్యక్షుడు గోపతి తిరుపతి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పిట్టల రవి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.